కన్నీరు, గుండెల్లో రగిలే మంటలను
ఆర్పాలని మనసు నుండి ప్రవహించు గంగ.
కన్నీరు, మనస్సున శోక సాగర అలలకు
కట్టలు తెంచుకొనే దారి చూపే ప్రవాహ గంగ
ఆ మంటలు రగిలి కార్చిచ్చై ఆ కన్నీటి గంగ ఎండినా!
ఆ గంగ కట్టలు తెంచి సాగరాన్ని పోటెత్తేట్టు చేసినా!
వేయి సూర్యులైనా సరి తూగని, మండే ఆ జ్వాలను ఆపే శక్తి ఈ ప్రపంచానికి ఉందా?
ఎగసే ఆ పెను తుఫానును అదుపు చేసే చేవ ఎవరికైనా ఉందా?