Thursday, March 12, 2009

ప్రియతమా ....

ప్రియతమా ... తొలిసారి
నిను చూసిన తొలిసారి
నీ వశం ఆయెను నా మది ...
ఆనందం పరవళ్ళు తొక్కెను లోలోన ...
అనిపించెను తొలిసారి
ఇది ప్రేమేనా? ... ఇది ప్రేమేనా ?

ప్రియతమా ... ప్రతిసారి
నువ్వు చూసిన ప్రతిసారి
కరిగెను నా మనసు, నీ చిలిపి చూపులోన
అనిపించెను ప్రతిసారి
ఇది ప్రేమేనా? ... ఇది ప్రేమేనా ?

ప్రియతమా ప్రతిసారి ...
నిను చూడని ప్రతిసారి ..
అయినావు పదిలం, నీవు నా గుండెలోన ...
నీకు ఇంకేమని చెప్పను ... ఏమని పలుకను...
ఇది ప్రేమేనా? ... ఇది ప్రేమేనా ?

ప్రియతమా ఒకసారి ...
పలుకవా ఒకసారి ?...
ప్రళయం సహిస్తాను  నీకోసం , నీ కమ్మని పలుకుల కోసం...
బదులీయవా ఒకసారి ...?
ఇది ప్రేమేనా? ... ఇది ప్రేమేనా ?

ప్రియతమా ప్రతిసారి ...
నిను తలచిన ప్రతిసారి ...
జలధారలై ఉప్పొంగెను భావనలు ... ఉబికెను కవితలు
నీ బదులేమైనా ... నీ పలుకేమైనా ..
నాకు తెలిసెను .. నే నీకై వేచి ఉంటానని ...
నాకు తెలిసెను ...
ఇదే ప్రేమని ... ఇదే ప్రేమని ...
-నిశ్చల్

1 comment: